సహారా ఆస్తులు అమ్మేయండి! | Supreme Court orders sale of Sahara properties to recover dues of investors | Sakshi
Sakshi News home page

సహారా ఆస్తులు అమ్మేయండి!

Mar 29 2016 7:14 PM | Updated on Sep 2 2018 5:24 PM

సహారా ఆస్తులు అమ్మేయండి! - Sakshi

సహారా ఆస్తులు అమ్మేయండి!

సహారా చీఫ్ సుబ్రతారాయ్‌, ఆ కంపెనీ మరో ఇద్దరు డైరెక్టర్లను జైలు నుంచి విడుదల చేసేందుకు వీలుగా ఆ కంపెనీ ఆస్తులను అమ్మివేయాలని మార్కెట్ రెగ్యూలేటర్ సెబిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్‌, ఆ కంపెనీ మరో ఇద్దరు డైరెక్టర్లను జైలు నుంచి విడుదల చేసేందుకు వీలుగా ఆ కంపెనీ ఆస్తులను అమ్మివేయాలని మార్కెట్ రెగ్యూలేటర్ సెబిని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి సేకరించిన రూ. 10వేల కోట్ల డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు వీలుగా సహారా ఆస్తులను మార్కెట్‌లో అమ్మాల్సిందిగా మంగళవారం ఆదేశాలు జారీచేసింది. సహారా సంస్థకు మొత్తం 40వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటి అమ్మకాల కోసం స్వతంత్ర ఏజెన్సీని నియమించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని మూడు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మార్కెట్ రేటు (సర్కిల్ రేటు)పై 90శాతం కన్నా తక్కువకు ఆస్తులు అమ్మకుండా చూడాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ని ఆదేశించింది.

చిన్న పెట్టుబడిదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో 2014 మార్చిలో సహారా అధినేత సుబ్రతరాయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం రూ. 5వేల కోట్లు నగదు పుచీకత్తు, రూ. 5వేల కోట్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంతో ఆయన రెండేళ్లుగా జైలులో గడుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement