breaking news
Sahara properties
-
సహారా ఆస్తులు అమ్మేయండి!
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, ఆ కంపెనీ మరో ఇద్దరు డైరెక్టర్లను జైలు నుంచి విడుదల చేసేందుకు వీలుగా ఆ కంపెనీ ఆస్తులను అమ్మివేయాలని మార్కెట్ రెగ్యూలేటర్ సెబిని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి సేకరించిన రూ. 10వేల కోట్ల డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు వీలుగా సహారా ఆస్తులను మార్కెట్లో అమ్మాల్సిందిగా మంగళవారం ఆదేశాలు జారీచేసింది. సహారా సంస్థకు మొత్తం 40వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటి అమ్మకాల కోసం స్వతంత్ర ఏజెన్సీని నియమించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని మూడు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మార్కెట్ రేటు (సర్కిల్ రేటు)పై 90శాతం కన్నా తక్కువకు ఆస్తులు అమ్మకుండా చూడాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ని ఆదేశించింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో 2014 మార్చిలో సహారా అధినేత సుబ్రతరాయ్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం రూ. 5వేల కోట్లు నగదు పుచీకత్తు, రూ. 5వేల కోట్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంతో ఆయన రెండేళ్లుగా జైలులో గడుపుతున్నారు. -
సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : సహారా గ్రూపు ఆస్తుల అమ్మకానికి సుప్రీం కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ ఓ కమిటీని నియమించి సంస్థ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులను మార్కెట్ ధరలో 90 శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని సూచించింది. ఆ సంస్థకు చెందిన 86 ఆస్తులను కమిటీ పర్యవేక్షణలో అమ్మాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి ఎన్ అగర్వాల్, సహారా నేతృత్వంలో ఆస్తుల విక్రయం వ్యవహారాలను నిర్వహించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సహారా గ్రూపు సంస్థలు ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సుబ్రతా రాయ్కి బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.