కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం | Sukhoi-30MKI crashes in Shivkar Kudla village in Barmer | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

Mar 15 2017 3:55 PM | Updated on Sep 5 2017 6:10 AM

కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

సుఖోయ్‌-30 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకున్నారు.

రాజస్థాన్‌ : సుఖోయ్‌-30 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకున్నారు. రాజస్థాన్‌ బర్మర్‌ జిల్లా శివకర్‌ కుద్లా గ్రామం వద్ద బుధవారం విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఈ విమానాన్ని ఉత్తర్‌లాయి ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో ల్యాండ్‌ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన ధుర రామ్‌ ఆయన భార్య, మనవడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement