
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణం సాయంకాలం దుమ్ము, దూళీ, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఆకాశం పూర్తిగా మబ్బులతో కప్పివేయడంతో చీకటిగా మారిపోయింది. ఈదురు గాలులు, ఇసుక తుపానుతో కొంతసేపు ఢిల్లీ ప్రజలను అతలాకుతలం చేసింది. దీనికి తోడు ఒక్కసారిగా భారీ వర్షం సంభవించింది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడికి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భారీ గాలులకు పలుచోట్ల వృక్షాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.


