ఇంట్లోనే యోగా చేయండి! | Stay home this Yoga Day says PM Narendra Modi in video message | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే యోగా చేయండి!

Jun 19 2020 6:28 AM | Updated on Jun 19 2020 6:28 AM

Stay home this Yoga Day says PM Narendra Modi in video message - Sakshi

న్యూఢిల్లీ: యోగాతో బహుళ ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కారణంగా తలెత్తిన అనేక సవాళ్లకు యోగా పరిష్కారం చూపుతుందన్నారు. ఈ జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంట్లోనే, కుటుంబంతో కలిసి జరుపుకోవాలన్నారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ గురువారం ఒక వీడియో సందేశాన్ని వెలువరించారు.‘యోగాతో శరీరం, మనస్సు మధ్య దూరం తొలగుతుంది. ఆ దూరమే చాలా సమస్యలకు మూల కారణం. ఆకాంక్షలకు, వాస్తవాలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది’ అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ నినాదం ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా’ అని.. అందువల్ల అంతా భౌతిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్లల్లోనే యోగా సాధన చేయాలని కోరారు. గుంపులుగా సాధన చేయొద్దని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement