భూసేకరణ ఆర్డినెన్స్ వ్యతిరేకంగా రైతులు జరిపిన పోరాటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తలొగ్గిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు.
న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ వ్యతిరేకంగా రైతులు జరిపిన పోరాటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తలొగ్గిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పోరాటం ఇంకా ముగియలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు నష్టం చేసే.. అభివృద్ధికి మేం వ్యతిరేకం అని తెలిపారు. విదేశీ పర్యటనలకు, కార్పొరేట్లను కలిసేందుకు సమయం ఉంది కానీ.. రైతుల సమస్యలు వినేందుకు మోదీకి సమయం లేదా? అని సోనియాగాంధీ ఈ సందర్భంగా దుయ్యబట్టారు.