మోదీ, షా బతికి ఉండటం సోనియాకు ఇష్టం లేదు

Sonia and Rahul Gandhi Did Not Want Modi Amit Shah To live - Sakshi

సోనియా గాంధీపై రామ్‌దేవ్‌ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీపై ప్రముఖ యోగా గరువు రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు బతికిఉండటం వారిద్దరికీ ఇష్టం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమిత్‌ షాను చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టించారని, ఆయన జైల్లోనే చనిపోవాలని వారు కోరుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అమిత్‌ షాను జైలుపాలు చేసిన నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు కూడా అదేగతి పట్టిందని అన్నారు. తాను జైలుకు పోతానని చిదంబరం కలలో కూడా ఊహించి ఉండరని రామ్‌దేవ్‌ అభిప్రాయపడ్డారు. నోయిడాలో మంగళవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top