ఓటర్లను ఓ ఆట ఆడిస్తున్నారు!

Snake And Ladder Game Introduced For Awareness In Voters In Barmer - Sakshi

సాక్షి, జైపూర్‌ : రాజస్తాన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోవటానికి, ఓట హక్కు లేని వారు కొత్తగా ఓటు హక్కు పొందటానికి ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం అవగాహన సద్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అయితే బర్మార్‌ జిల్లాలోని ప్రభుత్వ అధికారులు ఓ అడుగు ముందకు వేశారు. ఓటర్లను ఉత్సాహరుస్తూ వారికి అవగాహన కల్పించటానికి ‘‘ వైకుంఠపాళి’’ ఆటను ఆడిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 1600 అడుగుల చదరపు అడుగుల ఆటకు సంబంధించిన బోర్డును ఏర్పాటుచేశారు. ఆట వైకుంఠపాళిని పోలి ఉన్నా నియమాలు కొద్దిగా వేరు.

అక్కడ పాము కరవటం శిక్ష అయితే.. ఇక్కడ మాత్రం ఓటరుగా నమోదు చేసుకోకపోవటం, డబ్బుకు ఓటును అమ్ముకోవటం, మద్యం కోసం అమ్ముకోవటం వంటివి ఇక్కడ పాము కాట్లు. ఇక నిచ్చెన ఎక్కటమంటే ఓటు హక్కు ప్రజాస్వామ్య పద్ధతిలో వినియోగించుకోవటం తోటి వారికి సైతం ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించటం వంటివి. ఈ అవగాహన కల్పించే ఆట ‘‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌’’లో సైతం చోటు సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆట ద్వారా అవగాహన కల్పించటానికి ప్లాన్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top