ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్‌తో పోల్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శనివారం చురక అంటించారు..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్‌తో పోల్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శనివారం చురక అంటించారు. హిట్లర్ వారసులు ఎవరో అందరికీ తెలుసని.. దేశంలో ఎమర్జెన్సీ విధించిందెవరో ఓసారి గుర్తు చేసుకుంటే మంచిదని ఆమె ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్‌కు ఎటువంటి ఢోకా లేదని, కాంగ్రెస్ భవిష్యత్తే ప్రశ్నర్థకంగా మారిందన్నారు.
42ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ మీద కాంగ్రెస్ స్పందించిందని, అందుకు బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బెంగళూరులో నిర్వ హించిన అంబేడ్కర్ అంతర్జాతీయ సదస్సులో రాహుల్ మాట్లాడారు. దేశాన్ని ముక్కలు చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో కలసి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు.