జమ్మూకాశ్మీర్లో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జమ్మూ ప్రాంతంలోని కిత్వార్, దోడా, రాంబన్, రేసి జిల్లాల్లో భూకంపం సంభవించింది.
జమ్మూకాశ్మీర్లో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జమ్మూ ప్రాంతంలోని కిత్వార్, దోడా, రాంబన్, రేసి జిల్లాల్లో భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు.
జమ్మూ ప్రాంతంలో భడర్వా పట్టణం కేంద్రంగా ఉదయం 5:35 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఏడాది ఆరంభం నుంచి జమ్మూలోని చెనాబ్ లోయలో భూ ప్రకంపనలు తరచూ వస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. కాశ్మీర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తలాత్ అహ్మద్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి కారణాలను అన్వేషించారు.