‘పాక్‌ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోంది’

Shiv Sena Aleges Pakistan Behaving Like Drunken Monkey - Sakshi

ముంబై : పాకిస్తాన్‌లో భారత హైకమిషన్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో అతిధుల పట్ల పాక్ వ్యవహరించిన తీరుపై శివసేన స్పందించింది. పాకిస్తాన్‌ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే వ్యాఖ్యానించారు. బాలాకోట్‌ వైమానిక దాడులతో పాకిస్తాన్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పినా ఇప్పటికీ పాక్‌ తీరు మారలేదని దుయ్యబట్టారు. పొరుగు దేశం తోకలను కత్తిరించే చర్యలు చేపట్టాలని కోరారు.

మోదీ ప్రభుత్వం తిరుగలేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో థాకరే పేర్కొన్నారు. శాంతి ప్రక్రియ పట్ల ఇమ్రాన్‌ ఖాన్‌ చొరవ చూపడం మంచిదే అయినా శనివారం ఇఫ్తార్‌ విందులో జరిగిన ఘటన శాంతిని నెలకొల్పే దిశగా ఉపకరిస్తుందా అని థాకరే ప్రశ్నించారు. కాగా, ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో బారత హైకమిషన్‌ నిర్వహించిన ఇఫ్తార్‌ పార్టీకి హాజరైన అతిధులను వేదిక వెలుపల భద్రతా అధికారులు నిలిపివేయడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top