నేనే ఈడీ ముందు హాజరవుతా!: పవార్‌

Sharad Pawar says will cooperate in money laundering probe - Sakshi

ముంబై: మనీ ల్యాండరిం గ్‌ కేసు విచారణకు తానే స్వచ్ఛందంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు ఈనెల 27న హాజరవుతానని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు కుంభకోణంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహారాజా ఛత్రపతి శివాజీ భావజాలాన్ని అనుసరించే తాను కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచబోనని స్పష్టంచేశారు. ‘ఈడీకి నా పూర్తి సహకారం ఉంటుంది’అని చెప్పారు. నేనే ముంబైలోని ఈడీ కార్యాలయానికి వెళ్తా. వాళ్లు అడిగే ఎలాంటి సమాచారాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా’అని పవార్‌ విలేకరులకు వెల్లడించారు. కాగా, పవార్, అతని సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్, మరో 70 మందిపై ఈడీ కేసువేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top