ఆ ఏడు మండలాలు ఆంధ్రలోనివే: రాజనాథ్ | Seven mandals in Andhra pradesh, says Home minister Rajnath singh | Sakshi
Sakshi News home page

ఆ ఏడు మండలాలు ఆంధ్రలోనివే: రాజనాథ్

Jul 11 2014 12:44 PM | Updated on Aug 21 2018 8:34 PM

ఆ ఏడు మండలాలు ఆంధ్రలోనివే: రాజనాథ్ - Sakshi

ఆ ఏడు మండలాలు ఆంధ్రలోనివే: రాజనాథ్

పోలవరం నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు.

పోలవరం నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజనాథ్ మాట్లాడుతూ... ప్రాజెక్ట్ నిర్మాణం నేపథ్యంలో గిరిజనులకు పునరావాసం కల్పిస్తామని, అదివాసుల హక్కులు కాపాడతామని వెల్లడించారు. ముంపు మండలాల విలీనం గత ప్రభుత్వ హయాంలోనే జరగిందన్నారు. ఏపీలో ప్రస్తుతం కలిపిన మండలాలు గతంతో ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవన్న విషయాన్ని రాజనాథ్ సింగ్ ఈ  సందర్భంగా గుర్తు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లుపై శుక్రవారం లోక్సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గిరిజనులకు, అదివాసులకు ఎటువంటి నష్టం జరగదంటూ పై విధంగా ప్రకటించారు. అయితే తెలంగాణ ఎంపీల నిరసనకు ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన ఎంపీలు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement