బిహార్‌ షెల్టర్‌ హోమ్స్‌ అన్నిటిపైనా సీబీఐ దర్యాప్తు

SC's big order - CBI to investigate all 17 cases - Sakshi

బాలలపై వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టాలని సుప్రీం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: బిహార్‌లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలలపై లైంగిక, శారీరక వేధింపుల ఘటనలపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. రాష్ట్రంలోని శరణాల యాల్లోని బాలలపై శారీరక, లైంగిక వేధింపు లకు సంబంధించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం బుధవారం కూడా విచారించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం.. ముజఫర్‌పూర్‌ శరణాలయంతోపాటు మిగతా 16 వసతి గృహాల్లోనూ బాలలపై వేధింపులు సాగుతున్నా యని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ పేర్కొంది. అందుకే తప్పనిసరిగా వాటి పైనా సీబీఐ విచారణ జరపాలి’ అని స్పష్టం చేసింది. అయితే, సీబీఐలో అంతర్గత వివాదా నికి సంబంధించిన కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారిస్తుండటంతో పాటు కీలక విధాన నిర్ణయాలు తీసుకోరా దంటూ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర రావుపై ఆంక్షలు ఉండ టాన్ని సీబీఐ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. 

బెంచ్‌ స్పందిస్తూ.. ప్రస్తుత విచారణ నిలిపివే యాలనేది ఆ ఉత్తర్వులకు అర్థం కాదంటూ దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమేనా అని సీబీఐని ప్రశ్నించింది. విచారణకు తాము సిద్ధమేననీ, అవసరమైన అధికారుల బృందాన్ని ప్రభుత్వం సమకూ ర్చాల్సి ఉంటుందని సీబీఐ తెలిపింది. దీంతో ధర్మాసనం బిహార్‌కు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు అనాథ శరణాలయాల్లో వేధింపులపై పోలీసు శాఖ యథాతథ దర్యాప్తు నివేదిక సమర్పించేందుకు వారం గడువు కావాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చుతూ, వెంటనే విచారణ బాధ్యతలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 12కు వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top