'సర్టిఫికెట్స్‌ కావాలంటే కోరిక తీర్చు' | School Staff Arrested For Sexually Harassing Teacher | Sakshi
Sakshi News home page

'సర్టిఫికెట్స్‌ కావాలంటే కోరిక తీర్చు'

Aug 13 2017 10:14 AM | Updated on Jul 23 2018 8:49 PM

'సర్టిఫికెట్స్‌ కావాలంటే కోరిక తీర్చు' - Sakshi

'సర్టిఫికెట్స్‌ కావాలంటే కోరిక తీర్చు'

మహిళా టీచర్‌ను వేధించిన ఓ ప్రభుత్వేతర పాఠశాలకు చెందిన కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

చెన్నై : మహిళా టీచర్‌ను వేధించిన ఓ ప్రభుత్వేతర పాఠశాలకు చెందిన కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌ రెండు నెలల కిందటే తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ టీచర్‌ తన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చింది.

అయితే, తన గదిలోకి రావాలంటూ ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌ రవి పిలిచాడు. అనంతరం ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ఒప్పుకోకపోతే ఆమె గురించి చెడుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన టీచర్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement