లాలూకు సుప్రీంలో ఎదురుదెబ్బ | SC Rejects Lalu Prasad Yadavs Bail Plea | Sakshi
Sakshi News home page

లాలూకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Apr 10 2019 12:10 PM | Updated on Apr 10 2019 12:10 PM

SC Rejects Lalu Prasad Yadavs Bail Plea - Sakshi

లాలూ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు పశుగ్రాస కుంభకోణం కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. లాలూ బెయిల్‌ అప్పీల్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో లాలూ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకే బెయిల్‌ కోరుతున్నారని ఆరోపించింది.

లాలూకు బెయిల్‌ మంజూరు చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. లాలూ ప్రసాద్‌ ఎనిమిది నెలలకు పైగా ఆస్పత్రి వార్డులోనే ఉన్నా ఇప్పటికీ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. కాగా లాలూ రాంచీలోని రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయాలు చక్కబెడుతున్నారని, ఇందుకు అక్కడికి వచ్చే విజిటర్ల జాబితానే కీలక ఆధారమని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement