ఎస్‌ఎస్‌సీ స్కామ్‌ : కేంద్రం వివరణ కోరిన సుప్రీం | SC Demands Centres Response In SSC Scam Case  | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీ స్కామ్‌ : కేంద్రం వివరణ కోరిన సుప్రీం

Published Mon, Mar 12 2018 5:26 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

SC Demands Centres Response In SSC Scam Case  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రశ్నాపత్రాల లీక్‌ కుంభకోణంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని వివరణ కోరింది.ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల స్కామ్‌పై సమాధానం ఇవ్వాలని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 21న నిర్వహించిన పరీక్షలు సాంకేతిక కారణాలతో మార్చి 9న తిరిగి నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎస్‌ఎస్‌సీ ప్రశ్నా పత్రాల లీకేజిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. యూత్‌ కాంగ్రెస్‌ ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో భారీ నిరసనలు చేపట్టింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధుల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం ఈ అంశంపై సీబీఐ విచారణకు ఈనెల 5న కేంద్రం అంగీకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement