త్రయంబకేశ్వర్‌లో తృప్తి పూజలు | Satisfied worshiping in trayambakesvar | Sakshi
Sakshi News home page

త్రయంబకేశ్వర్‌లో తృప్తి పూజలు

Mar 26 2016 1:25 AM | Updated on Aug 21 2018 5:46 PM

త్రయంబకేశ్వర్‌లో తృప్తి పూజలు - Sakshi

త్రయంబకేశ్వర్‌లో తృప్తి పూజలు

మహిళలకు గర్భగుడి ప్రవేశ నిషేధంపై పోరాడుతున్న భూమాతా బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ ద్వాదశ జ్యోతిర్లిం గాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్ ఆలయంలోకి వెళ్లారు.

గర్భగుడి బయటి నుంచే దర్శనం

 సాక్షి, ముంబై: మహిళలకు గర్భగుడి ప్రవేశ నిషేధంపై పోరాడుతున్న భూమాతా బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ ద్వాదశ జ్యోతిర్లిం గాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్ ఆలయంలోకి వెళ్లారు. శుక్రవారం ఆలయ గర్భగుడిలోని శివలింగాన్ని బయటి నుంచే దర్శించుకొని పూజలు చేశారు (గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది). ఆమె గర్భగుడిలోకి వెళ్లడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం. అనంతరం ఆమెను పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా బయటికి పంపారు.

తృప్తి వచ్చిన విషయం తెలియడంతో ఆమెను అడ్డుకోవడానికి స్థానికులు అక్కడ గుమిగూడారు. వారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, మొత్తమ్మీద శాంతియుతంగానే ముగిసిందని పోలీసులు చెప్పారు. నిఫాద్ తాలూకాలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం తృప్తి ఇద్దరు కార్యకర్తలతో కలసి త్రయంబకేశ్వర్‌కు వెళ్లారు. ఆలయానికి వస్తున్నట్లుగా ఆమె ముందస్తుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈనెల 7న మహాశివరాత్రి పర్వదినాన ఆమె త్రయంబకేశ్వర్ గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, స్థానిక మహిళలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement