కాంగ్రెస్‌కు సజ్జన్‌ కుమార్‌ రాజీనామా | Sajjan Kumar Resigns From Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు సజ్జన్‌ కుమార్‌ రాజీనామా

Dec 18 2018 11:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

Sajjan Kumar Resigns From Congress - Sakshi

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి సజ్జన్‌ కుమార్‌ రాజీనామా..

సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు సజ్జన్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి రాసిన లేఖలో సజ్జన్‌ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్‌కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు.

కాగా, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో సజ్జన్‌ను ప్రత్యేక కోర్టు నిర్ధోషిగా పేర్కొంటూ విముక్తి కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దిగువ కోర్టు తీర్పును పక్కనపెట్టిన హైకోర్టు సజ్జన్‌ దోషేనంటూ స్పష్టం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది.

Advertisement
 
Advertisement
Advertisement