‘విగ్రహాల కూల్చివేత వారి పనే’  | RSS, BJP Signalled Cadres To Destroy Statues Of Leaders | Sakshi
Sakshi News home page

‘విగ్రహాల కూల్చివేత వారి పనే’ 

Mar 20 2018 3:14 PM | Updated on Aug 25 2018 6:31 PM

RSS, BJP Signalled Cadres To Destroy Statues Of Leaders - Sakshi

ఫైల్‌ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో లెనిన్‌ విగ్రహాల ధ్వంసాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రోత్సహించాయని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తమ సిద్ధాంతాలతో విభేదించే వారి విగ్రహాలను ధ్వంసం చేయాలని వారు తమ శ్రేణులకు సంకేతాలు పంపారన్నారు. దళితుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పెరియార్‌ విగ్రహాన్నీ ఇవాళ తమిళనాడులో ధ్వంసం చేశారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

పెరియార్‌ విగ్రహం నుంచి తలను కొందరు దుండగులు మంగళవారం వేరుచేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పెరియార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు తిరుపత్తూర్‌లో ఓ బీజేపీ, ఓ సీపీఎం కార్యకర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు గత వారం అస్సాంలోని కొక్రాజర్‌లో జన్‌సంఘ్‌ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని కొందరు దుండగులు కూల్చివేశారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలోనూ మరో ముఖర్జీ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement