రోడ్ల కోసం ఏడాదికో లక్ష కోట్లు!! | Rs 1 lakh crore funds for road sector in a year, says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

రోడ్ల కోసం ఏడాదికో లక్ష కోట్లు!!

Jul 3 2014 2:49 PM | Updated on Aug 15 2018 2:20 PM

రోడ్ల కోసం ఏడాదికో లక్ష కోట్లు!! - Sakshi

రోడ్ల కోసం ఏడాదికో లక్ష కోట్లు!!

దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ రెండేళ్లలో అద్భుతంగా తయారుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించనుంది.

దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ రెండేళ్లలో అద్భుతంగా తయారుచేయాలని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు రవాణా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై తాను నెల రోజుల్లోగా ఓ బ్లూప్రింట్ రూపొందిస్తానని, ఏడాదికి లక్ష కోట్ల వరకు కేటాయిస్తానని, రెండేళ్లలోనే ఫలితాలు కనిపిస్తాయని కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఓ సదస్సులో గడ్కరీ చెప్పారు.

గత ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తూ కేంద్రప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేసిన ఏడాది తర్వాత గడ్కరీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భూసేకరణ సరిగా చేయకపోవడం వల్ల ఈ రంగం దారుణంగా తయారైందని, జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన ప్రాజెక్టులలో 60 శాతం వరకు ఇప్పుడు వివాదాల్లో మునిగిపోయాయని శ్వేతపత్రంలో తెలిపారు. దేశ ప్రజలకు మంచిరోజులు రానున్నాయని, జాతీయ రహదారుల రంగంలో జాతి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు నెల రోజుల్లోగా బిల్లులు మంజూరవుతాయని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement