అయోధ్య తీర్పును వ్యతిరేకించిన జస్టిస్‌ గంగూలీ

Retired SC Judge Says Minorities Have Been Wronged Over Ayodhya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దీర్ఘకాలంగా నలుగుతున్న అయోధ్య వివాదానికి స్వస్తిపలుకుతూ సుప్రీం కోర్టు వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ వెలువరించిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి ఏకే గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం కేంద్రానికి అప్పగించాలన్న సర్వోన్నత న్యాయస్ధాన నిర్ణయం మైనారిటీల దృష్టిలో సరైంది కాదని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో తాను కలత చెందానని ఆయన చెప్పారు. ‘రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు ప్రసాదించింది. అయితే ఈ కేసులో మైనారిటీలకు న్యాయం జరగలేద’ని రిటైర్డ్‌ జస్టిస్‌ గంగూలీ వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదును కూల్చివేశారనేది కాదనలేని విషయమని, సుప్రీం కోర్టు సైతం తన తీర్పులో బాబ్రీ విధ్వంసం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిందని అన్నారు. దీన్నిబట్టి చూస్తే సుప్రీం తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నది స్పష్టమని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top