చిరు వ్యాపారులకు ఊరట | Relief On Late Fee For GST Return Filing | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకు పరిహారంపై త్వరలో నిర్ణయం

Jun 12 2020 4:25 PM | Updated on Jun 12 2020 5:29 PM

Relief On Late Fee For GST Return Filing - Sakshi

జీఎస్టీ రిటన్స్‌ దాఖలులో చిరువ్యాపారులకు ఊరట

సాక్షి, న్యూఢిల్లీ : చిరువ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మే, జూన్‌, జులై మాసాలకు జీఎస్టీఆర్‌-3బీ ఫామ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా దాఖలు చేసే రూ 5 కోట్ల టర్నోవర్‌ లోపు చిరువ్యాపారులపై ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

ఇక జులై 6 వరకూ జీఎస్టీ రిటన్స్‌ను దాఖలు చేసే పన్నుచెల్లింపుదారులపై అపరాథ వడ్డీ ఉండదని, ఆ తర్వాత జీఎస్టీ రిటన్స్‌ను ఫైల్‌ చేసే చిరు పన్నుచెల్లింపుదారులపై విధించే వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించామని, ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఇక రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించేందుకు జులైలో అదే అజెండాతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. పాన్‌ మసాలాపై పన్ను విధించే ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ భేటీలో చర్చిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement