మధ్యప్రదేశ్ గవర్నర్‌కు ఊరట | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ గవర్నర్‌కు ఊరట

Published Wed, May 6 2015 2:23 AM

మధ్యప్రదేశ్ గవర్నర్‌కు ఊరట - Sakshi

జబల్‌పూర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్టు స్కామ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ రాంనరేశ్ యాదవ్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది. రాష్ట్ర అధినేతగా రాజ్యాంగం కల్పించిన న్యాయ రక్షణల వల్ల ఆయనపై పదవిలో ఉండగా ఎలాంటి కేసులు నమోదు చేయటానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పు చెప్పింది.

అవసరమైతే గవర్నర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయవచ్చని పోలీసులకు సూచించిం ది. స్టేట్‌మెంట్ రికార్డు సమయంలో న్యాయపరమైన అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఈ కేసులో మిగతా నిందితులపై కేసుల నమోదుకు కానీ, విచారణకు కానీ స్వతంత్రంగా చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement