ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు | Ratlam Jewellers Mahesh Soni Wear 52 Gold Rings | Sakshi
Sakshi News home page

ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు

Sep 18 2014 2:16 PM | Updated on Aug 3 2018 3:04 PM

ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు - Sakshi

ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు

బంగారు ఆభరణాలపై అతివలకే కాదు...పురుషులకూ మోజు పెరుగుతోంది. నగలు ధరించి ధగధగలాడి పోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరుగుతున్నారు.

బంగారు ఆభరణాలపై అతివలకే కాదు...పురుషులకూ మోజు పెరుగుతోంది. నగలు ధరించి ధగధగలాడి పోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరుగుతున్నారు. మన సాంప్రదాయాన్ని తీసుకుంటే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. కాలక్రమేణా పురుషులు ఆభరణాలు ధరించటం తగ్గిపోయింది.  అయితే ఇప్పుడు మాత్రం ఆ టేస్టు మారుతోంది. మెడలో సింపుల్గా చైన్తో కాకుండా... ఒంటి నిండా బంగారం దిగేసుకుని మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు.

ఇటీవల మహారాష్ట్రకు చెందిన పంకజ్ పరాఖ్ అనే వ్యాపారి అలా ఇలా కాదు...ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ బంగారు చొక్కా బరువు నాలుగు కిలోలు. ముంబై సమీపంలోని యోలా వీధిలో ఇతగాడు పసిడి చొక్కాతో పాటు ఒంటిపై మూడు కిలోల నగలు ధరించి మహిళలకు పోటీ ఇవ్వటం విశేషం.

తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లా పట్టణానికి చెందిన మహేశ్ సోనీ చేతినిండా ఉంగరాలు.. ధగధగ మెరిసే బంగారు బ్రెస్‌లెట్‌తో ఉంగరాల బంగార్రాజుగా గుర్తింపు పొందారు. బంగారం వ్యాపారం చేసే మహేశ్ తన  చేతివేళ్లు అన్నింటికీ కలిపి ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు. నవరత్నాలు, వజ్రాలు పొదిగిన ఈ ఉంగరాలతో పాటు ఒక పెద్ద బ్రేస్‌లెట్, బంగారు గొలుసును ఆయన గత పుష్కరకాలంగా ధరిస్తూ వస్తున్నారు. వాటి ఖరీదు అక్షరాల కోటి రూపాయలు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement