breaking news
Pankaj Parakh
-
బంగారు కొండతో స్పెషల్ చిట్ చాట్
-
ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు
బంగారు ఆభరణాలపై అతివలకే కాదు...పురుషులకూ మోజు పెరుగుతోంది. నగలు ధరించి ధగధగలాడి పోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరుగుతున్నారు. మన సాంప్రదాయాన్ని తీసుకుంటే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. కాలక్రమేణా పురుషులు ఆభరణాలు ధరించటం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ టేస్టు మారుతోంది. మెడలో సింపుల్‌గా చైన్‌తో కాకుండా... ఒంటి నిండా బంగారం దిగేసుకుని మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పంకజ్ పరాఖ్ అనే వ్యాపారి అలా ఇలా కాదు...ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ బంగారు చొక్కా బరువు నాలుగు కిలోలు. ముంబై సమీపంలోని యోలా వీధిలో ఇతగాడు పసిడి చొక్కాతో పాటు ఒంటిపై మూడు కిలోల నగలు ధరించి మహిళలకు పోటీ ఇవ్వటం విశేషం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లా పట్టణానికి చెందిన మహేశ్ సోనీ చేతినిండా ఉంగరాలు.. ధగధగ మెరిసే బంగారు బ్రెస్లెట్తో ఉంగరాల బంగార్రాజుగా గుర్తింపు పొందారు. బంగారం వ్యాపారం చేసే మహేశ్ తన చేతివేళ్లు అన్నింటికీ కలిపి ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు. నవరత్నాలు, వజ్రాలు పొదిగిన ఈ ఉంగరాలతో పాటు ఒక పెద్ద బ్రేస్లెట్, బంగారు గొలుసును ఆయన గత పుష్కరకాలంగా ధరిస్తూ వస్తున్నారు. వాటి ఖరీదు అక్షరాల కోటి రూపాయలు. -
పది పాసవ్వలేదు కాని పసిడి చొక్కా ధరించాడు
ముంబై: ధరలు చుక్కలంటుతున్న ప్రస్తుతం ఓ ఖద్దరు చొక్కా కొనుక్కోవాలంటేనే పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఓ వ్యక్తి ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి అందర్ని ఆకట్టుకున్నాడు. ఆ చొక్కా బరువు నాలుగు కిలోలు. ధర ఏకంగా కోటి 30 లక్షల (214,000 డాలర్లు) రూపాయలు. ముంబై నగరానికి 260 కిలో మీటర్ల దూరంలో ఉన్న యోలా లోని బంగారు బాబు పంకజ్ పరాఖ్ కనీస విద్యార్హత పది తరగతి కూడ దాటలేదట. పది పాస్ కాని పంకజ్ మాత్రం దస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి ఏకంగా బంగారు చొక్కాను ధరించే స్థాయి చేరుకోవడం చర్చనీయాంశం. యోలా వీధిలో ఎప్పుడు అడుగుపెట్టినా బంగారు చొక్కానే కాకుండా మూడు కేజీల నగలు కూడా ధరించి దర్జాగా తీరుగుతుంటాడు. గత శుక్రవారం జరిగిన 45వ జన్మదినానికి ప్రత్యేక అతిధుల జాబితా ఘనంగా ఉంది. బంగారు బాబు జన్మదిన కార్యక్రమానికి మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఛగన్ భుజ్ భల్, ఓ డజను ఎమ్మెల్యేలు, సెలబ్రీటీలు తరలివచ్చారు. ఏడు బంగారు గుండీలున్న పంకజ్ బంగారు చొక్కా తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది.