సీఎం కాళ్లు మొక్కిన ముఖ్యమంత్రి | Raman Singh Touched The Feet Of Yogi Adityanath | Sakshi
Sakshi News home page

సీఎం కాళ్లు మొక్కిన ముఖ్యమంత్రి

Oct 23 2018 7:44 PM | Updated on Oct 23 2018 8:38 PM

Raman Singh Touched The Feet Of Yogi Adityanath - Sakshi

యోగి ఆదిత్యనాథ్‌ పాదాలకు నమస్కరిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌

రాయ్‌పూర్‌ : మాములుగానేతై నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కుతుంటారు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ఎక్కడ చూసి ఉండరు. కానీ ఈ అరుదైన సంఘటన మన భారతదేశంలోనే ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రమణ్‌ సింగ్‌(66) వయసులో తన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్న వాడైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌(46) కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

వచ్చే నెల ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలోల​ రమణ్‌ సింగ్‌ రాజ్‌నందన్‌గావ్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్‌ వేయడానికి వెళ్లే ముందు ఇలా యూపీ సీఎం యోగి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్‌ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ్‌నందన్‌గావ్‌ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అయితే సీనియర్లు ఇలా యోగికి పాదాభివందనం చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ యోగి ఆదిత్యనాథ్‌ ముందు శిరస్సు వంచి నిల్చుని ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement