రాజ్యసభ: పాత యూనీఫాంనే ఫాలో అయ్యారు! | Rajya Sabha Marshals Abandon Traditional Pagri | Sakshi
Sakshi News home page

రాజ్యసభ: పాత యూనీఫాంనే ఫాలో అయ్యారు!

Nov 25 2019 3:37 PM | Updated on Nov 25 2019 4:40 PM

Rajya Sabha Marshals Abandon Traditional Pagri - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్‌ కొత్త యూనిఫాంపై విమర్శలు లేవనెత్తడంతో.. సోమవారం తిరిగి పాత భారతీయ సంప్రదాయ వస్త్రధారణనే తిరిగి కొనసాగించారు. రాజ్యసభలో మార్షల్స్‌కు ఆర్మీ తరహా యూనీఫాంను ప్రవేశపెట్టడంపై పలు పార్టీలు, ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మార్షల్స్‌ సరిగ్గా వారం రోజుల తర్వాత.. వివాదాస్పద యూనీఫాంను పక్కనబెట్టి మళ్లీ పాత సంప్రదాయిక దుస్తుల్లో కనిపించారు. అయితే ఈసారి గతానికి కాస్త భిన్నంగా తలపై ధరించే 'పగ్రి' లేకుండా.. ముదురు రంగు బంధ్గాల సూట్స్‌ ధరించి రాజ్యసభలో కనిపించారు.  

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement