breaking news
Bandhgala suits
-
రాజ్యసభ: పాత యూనీఫాంనే ఫాలో అయ్యారు!
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త యూనిఫాంపై విమర్శలు లేవనెత్తడంతో.. సోమవారం తిరిగి పాత భారతీయ సంప్రదాయ వస్త్రధారణనే తిరిగి కొనసాగించారు. రాజ్యసభలో మార్షల్స్‌కు ఆర్మీ తరహా యూనీఫాంను ప్రవేశపెట్టడంపై పలు పార్టీలు, ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మార్షల్స్ సరిగ్గా వారం రోజుల తర్వాత.. వివాదాస్పద యూనీఫాంను పక్కనబెట్టి మళ్లీ పాత సంప్రదాయిక దుస్తుల్లో కనిపించారు. అయితే ఈసారి గతానికి కాస్త భిన్నంగా తలపై ధరించే 'పగ్రి' లేకుండా.. ముదురు రంగు బంధ్గాల సూట్స్ ధరించి రాజ్యసభలో కనిపించారు. Copying and wearing of military uniforms by non military personnel is illegal and a security hazard. I hope @VPSecretariat, @RajyaSabha & @rajnathsingh ji will take early action. https://t.co/pBAA26vgcS — Vedmalik (@Vedmalik1) November 18, 2019 -
అదిరేటి డ్రెస్సుల్లో మోదీ..!
న్యూఢిల్లీ: కొలతల్లో ఎక్కడా తేడా రాకుండా కుట్టిన బంధ్‌గళా సూట్లు, హాఫ్‌స్లీవ్ కుర్తాలు, మిరుమిట్లు గొలిపే రంగురంగుల నెహ్రూ జాకెట్లు.. మొత్తంగా మనిషిని చూస్తేనే అదిరేటి డ్రెస్సేశాడు.. అనిపించే వస్త్రధారణ..! అమెరికాలో పర్యటిస్తున్న మోదీ గురించి అభిమానులే కాకుండా చెయ్యితిరిగిన ఫ్యాషన్ డిజైనర్లు కూడా అంటున్న మాట ఇది. మామూలుగానే చక్కని దుస్తు ల్లో కనిపించే మోదీ అగ్రరాజ్య పర్యటనలో మరింత సొగసైన వస్త్రధారణలతో చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్నారు. గంభీరమైన సమావేశాలు, కలివిడిగా సాగే ఇష్టాగోష్టులు, విందులు.. ఏ కార్యక్రమమైనా సరే సందర్భోచిత దుస్తుల్లో హాజరవుతున్నారు. సందర్భానికి తగ్గ పాదరక్షలు వేసుకుంటున్నారు. అంతగా ఆకట్టుకుంటున్న మోదీ వస్త్రధారణ వెనుక ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ట్రాయ్ కోస్టా కృషి ఉంది. మోదీ ఐదురోజుల అమెరికా పర్యటనకు కావలసిన దుస్తులు కోస్టా నేతృత్వంలోనే రూపుదిద్దుకున్నాయి. తీరైన బంధ్గళాలు, కాంతిమంతమైన రంగురంగుల కాలర్ జాకెట్లు, ట్రిమ్ చేసిన గడ్డంతో మోదీ అమెరికాలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారని ఫ్యాషన్ డిజైనర్ కృష్ణా మెహతా అన్నారు. అమెరికా వెళ్లేందుకు ఫ్రాంక్‌ఫర్ట్‌కు వచ్చినప్పుడు మోదీ బూడిదరంగు కుర్తా, రాగిరంగు జాకెట్, గోధుమరంగు బూట్లతో ఆకర్షణీయంగా కనిపిం చారు. తర్వాత తెల్ల చొక్కా, ఖాకీరంగు బంధ్‌గళా జాకెట్, నల్ల బూట్లతో అమెరికాలో మెరిశారు. న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్లో తన ట్రేడ్‌మార్క్ హాఫ్‌స్లీవ్ కుర్తా, చుడీదార్, కోబోల్ట్, నీలిరంగు జాకెట్‌తో కనిపించారు. మేడిసన్ స్క్వేర్ గార్డెన్ సభలోనూ లేత కాషాయ రంగు జాకెట్లో కొట్టొచ్చినట్లు కనిపించారు.