అదిరేటి డ్రెస్సుల్లో మోదీ..! | pm narendra moi use in new model drass | Sakshi
Sakshi News home page

అదిరేటి డ్రెస్సుల్లో మోదీ..!

Sep 30 2014 1:33 AM | Updated on Oct 1 2018 1:12 PM

అదిరేటి డ్రెస్సుల్లో మోదీ..! - Sakshi

అదిరేటి డ్రెస్సుల్లో మోదీ..!

కొలతల్లో ఎక్కడా తేడా రాకుండా కుట్టిన బంధ్‌గళా సూట్లు, హాఫ్‌స్లీవ్ కుర్తాలు, మిరుమిట్లు గొలిపే రంగురంగుల నెహ్రూ జాకెట్లు..

న్యూఢిల్లీ: కొలతల్లో ఎక్కడా తేడా రాకుండా కుట్టిన బంధ్‌గళా సూట్లు, హాఫ్‌స్లీవ్ కుర్తాలు, మిరుమిట్లు గొలిపే రంగురంగుల నెహ్రూ జాకెట్లు.. మొత్తంగా మనిషిని చూస్తేనే అదిరేటి డ్రెస్సేశాడు.. అనిపించే వస్త్రధారణ..! అమెరికాలో పర్యటిస్తున్న మోదీ గురించి అభిమానులే కాకుండా చెయ్యితిరిగిన ఫ్యాషన్ డిజైనర్లు కూడా అంటున్న మాట ఇది. మామూలుగానే చక్కని దుస్తు ల్లో కనిపించే మోదీ అగ్రరాజ్య పర్యటనలో మరింత సొగసైన వస్త్రధారణలతో చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్నారు. గంభీరమైన సమావేశాలు, కలివిడిగా సాగే ఇష్టాగోష్టులు, విందులు.. ఏ కార్యక్రమమైనా సరే సందర్భోచిత దుస్తుల్లో హాజరవుతున్నారు. సందర్భానికి తగ్గ పాదరక్షలు వేసుకుంటున్నారు.

అంతగా ఆకట్టుకుంటున్న మోదీ వస్త్రధారణ వెనుక ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ట్రాయ్ కోస్టా కృషి ఉంది. మోదీ ఐదురోజుల అమెరికా పర్యటనకు కావలసిన దుస్తులు కోస్టా నేతృత్వంలోనే రూపుదిద్దుకున్నాయి. తీరైన బంధ్‌గళాలు, కాంతిమంతమైన రంగురంగుల కాలర్ జాకెట్లు, ట్రిమ్ చేసిన గడ్డంతో మోదీ అమెరికాలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారని ఫ్యాషన్ డిజైనర్ కృష్ణా మెహతా అన్నారు. అమెరికా వెళ్లేందుకు ఫ్రాంక్‌ఫర్ట్‌కు వచ్చినప్పుడు మోదీ బూడిదరంగు కుర్తా, రాగిరంగు జాకెట్, గోధుమరంగు బూట్లతో ఆకర్షణీయంగా కనిపిం చారు. తర్వాత తెల్ల చొక్కా, ఖాకీరంగు బంధ్‌గళా జాకెట్, నల్ల బూట్లతో అమెరికాలో మెరిశారు. న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌లో తన ట్రేడ్‌మార్క్ హాఫ్‌స్లీవ్ కుర్తా, చుడీదార్, కోబోల్ట్, నీలిరంగు జాకెట్‌తో కనిపించారు. మేడిసన్ స్క్వేర్ గార్డెన్ సభలోనూ లేత కాషాయ రంగు జాకెట్‌లో కొట్టొచ్చినట్లు కనిపించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement