రఫేల్‌ చేరిక సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh Said About Rafale Deterrent Not To Attack - Sakshi

పారిస్‌: అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది దేశ భద్రత కోసమే కానీ.. ఇతర దేశాలపై దాడి చేసే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. ఫ్రాన్స్‌లో తొలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని మంగళవారం అధికారికంగా స్వీకరించిన సంగతి తెలిసిందే. రఫేల్‌ యుద్ధ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు రాజ్‌నాథ్‌ సింగ్‌. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఇది చాలా చారిత్రత్మక రోజు. రఫేల్‌ అప్పగింతతో భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య బంధం మరింత బలపడింది. రఫేల్‌ చేరికత భారత వైమానిక రంగం మరింత శక్తివంతంగా మారింది. భారత్‌ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసమే ఆయుధాలను సమకూర్చుకుంటుంది. ఏ దేశం మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదని’ రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.


ఆయుధ పూజ అనంతరం రాజ్‌నాథ్‌ రఫేల్‌ జెట్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తన అనుభూతిని తెలుపుతూ.. రఫేల్‌లో విహరించడం సౌకర్యంగా, హాయిగా ఉందన్నారు. సూపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణిస్తానని జీవితంలో ఎప్పుడు అనుకోలేదని తెలిపారు రాజ్‌నాథ్‌ సింగ్‌. రఫేల్‌ జెట్ల చేరిక ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కాలన్నారు. దేశ భద్రత కోసం మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజ్‌నాథ్‌ తెలిపారు. ఫిబ్రవరి 2021నాటికి ఫ్రాన్స్‌ మరో 18 రఫేల్‌ యుద్ధ విమానాలను భారతకు అందజేస్తుంది. మే 2022 నాటికి దేశం మొత్తం మీద 36 రఫేల్‌ జెట్లు ఉండబోతున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top