రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల | rajnath singh promise to help flood hitted telangana | Sakshi
Sakshi News home page

రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల

Oct 2 2016 5:03 PM | Updated on Sep 4 2017 3:55 PM

రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల

రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల

తమ రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి ఆయన ఆదివారం ఢిల్లీలో రాజ్ నాథ్ ను కలిశారు.

సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భారీ వర్షాలతో రూ.2,200 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్పారు. 671 చెరువులకు గండ్లు పెడ్డాయని, భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపుతామని రాజ్ నాథ్ చెప్పారని అన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసాయిచ్చారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement