శారదా స్కామ్‌ ఎఫెక్ట్‌ : కోల్‌కతా పోలీస్‌ చీఫ్‌ బదిలీ

Rajeev Kumar Replaced By Anuj Sharma As New Kolkata Police Chief - Sakshi

కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌లో సీబీఐ విచారణను ఎదుర్కొన్న కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఐజీ, నేర పరిశోధన విభాగంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. కోల్‌కతా పోలీస్‌ చీఫ్‌గా రాజీవ్‌ కుమార్‌ స్దానంలో అనుజ్‌ శర్మ నియమితులయ్యారు. శారదా చిట్‌ఫండ్‌, రోజ్‌ వ్యాలీ స్కామ్‌ల్లో ఆధారాలను రాజీవ్‌ కుమార్‌ తారుమారు చేశారని సీబీఐ ఆరోపిస్తున్న క్రమంలో ఆయనను కోల్‌కతా పోలీస్‌ చీఫ్‌గా తప్పించడం గమనార్హం.

కాగా, కాల్‌ రికార్డు​ఆధారాలను రాజీవ్‌ కుమార్‌ తారుమారు చేశారని సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు కోల్‌కతాలోని ఆయన నివాసానికి సీబీఐ బృందాలు చేరుకోగా సీఎం మమతా బెనర్జీ ఆయనకు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ ఆమె ధర్నా చేపట్టగా కొన్ని విపక్ష పార్టీలు దీదీకి మద్దతు ప్రకటించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top