తనను కలిసి రైతుల సమస్యలను క్షుణ్ణంగా వివరించిన కొద్ది రోజులకే అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధ రైతు సుర్జిత్ సింగ్(60) కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.
ఫతేగఢ్: తనను కలిసి రైతుల సమస్యలను క్షుణ్ణంగా వివరించిన కొద్ది రోజులకే అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధ రైతు సుర్జిత్ సింగ్(60) కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. వారి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దాదువల్ గ్రామానికి చెందిన సుర్జీత్ సింగ్ ఈ నెల పదిన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గతంలో పంజాబ్ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు సుర్జీత్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా చక్కగా వివరించారు. దీంతో ఆయన కుటుంబాన్ని రాహుల్ గురువారం ఉదయం పరామర్శించడంతోపాటు మరికొందరు రైతుల కుటుంబాలు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతుల ఆత్మహత్యలు అని ఆరోపించారు.