నినాదాలతో పరిశుభ్ర భారత్‌గా మార్చలేం: రాహుల్ | Rahul gandhi fires on Pm modi | Sakshi
Sakshi News home page

నినాదాలతో పరిశుభ్ర భారత్‌గా మార్చలేం: రాహుల్

Apr 13 2016 1:40 AM | Updated on Aug 15 2018 6:32 PM

నినాదాలతో పరిశుభ్ర భారత్‌గా మార్చలేం: రాహుల్ - Sakshi

నినాదాలతో పరిశుభ్ర భారత్‌గా మార్చలేం: రాహుల్

ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.

ముంబై: ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. స్పష్టమైన వ్యూహం, సరైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా కేవలం నినాదాలతో దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చలేమని ఎద్దేవా చేశారు. ముంబైలోని దేవనార్ డంపింగ్ గ్రౌండ్‌ను ఆయన కాంగ్రెస్ నేతలతో కలసి మంగళవారం సందర్శించారు.

గత నెల రోజుల కాలంలో ఈ డంపింగ్ గ్రౌండ్‌లో మూడుసార్లు అగ్నిప్రమాదం జరిగింది. అందులోంచి వస్తున్న పొగ, విషవాయువుల వల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ఈ డంపింగ్ గ్రౌండ్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ అక్కడ పర్యటించారు.

Advertisement
 
Advertisement
Advertisement