జన సంద్రమైన ‘ఆజాద్‌’ మైదాన్‌!

Protests Against CAA NRC NPR In Azad Maidan Maharashtra - Sakshi

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన

ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)ను నిరసిస్తూ మహారాష్ట్రలో వేలాది మంది ఒక్కచోటకు చేరారు. ‘‘హమ్‌ దేఖేంగే’’ అంటూ ఉర్దూ కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ పద్యాల్లోని పంక్తులను ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ’’పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా, జాతీయ జనాభా పట్టిక జాతీయ వ్యతిరేక కూటమి’’ ... మహా-మోర్చా పేరిట ముంబైలోని చరిత్రాత్మక ఆజాద్‌ మైదాన్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది.(డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు)

నవీ ముంబై, థానే తదితర ప్రాంతాలు, రాష్ట్రం నలుమూల నుంచి మైదానానికి చేరుకున్న నిరసనకారులు.. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబూని... ‘మోదీ, షా సే ఆజాదీ’ (మోదీ, షా నుంచి స్వాతంత్ర్యం కావాలి) అంటూ నినాదాలు చేశారు. ఇక మహిళా నిరసనకారులు..‘‘ఝాన్సీ రాణీ కుమార్తెలం’’ అంటూ ఆందోళనకు దిగారు. అదే విధంగా సీఏఏకు ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని.. ఈ మేరకు పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డు జడ్జి కోల్సే పాటిల్‌, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌, నటుడు సుశాంత్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబూ అసీం అజ్మీ తదితర ప్రముఖులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. (అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా)

ఎన్‌పీఆర్‌పై త్రిపుర కీలక నిర్ణయం!

ఎన్‌పీఆర్‌ అంటే ఏమిటి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top