స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! | Potency test of accused necessary in rape case: Supreme Court | Sakshi
Sakshi News home page

స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

Aug 20 2014 7:45 PM | Updated on Sep 2 2018 5:20 PM

స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! - Sakshi

స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

2010 సంవత్సరంలో నమోదైన రేప్ కేసులో స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది

న్యూఢిల్లీ: 2010 సంవత్సరంలో నమోదైన రేప్ కేసులో స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేప్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలు తప్పనిసరి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. తనపై నమోదైన రేప్ కేస్ లో లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు నిత్యానంద అంగీకరించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. 
 
ప్రస్తుత కాలంలో రేప్ కేసులు ఎక్కువ మోతాదులో నమోదవుతున్న కారణంగా ఇలాంటి పరీక్షలు తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. లింగ సామర్ధ్య పరీక్షలు నిర్వహించకూడదా అంటూ నిత్యానందను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ప్రశ్నించారు. బలవంతంగా పరీక్షలు జరిపితే తాను అంగీకరించనని నిత్యానంద కోర్టును వేడుకున్నారు. ఈ కేసులో పరీక్షలు జరపడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నారని పోలీసులకు కోర్టు చురకలంటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement