పసిపాపను వాషింగ్ మెషిన్లో పడేశారు.. | Police probing who dumped baby in washing machine | Sakshi
Sakshi News home page

పసిపాపను వాషింగ్ మెషిన్లో పడేశారు..

Sep 5 2015 12:23 PM | Updated on Aug 11 2018 8:15 PM

పసిపాపను వాషింగ్ మెషిన్లో పడేశారు.. - Sakshi

పసిపాపను వాషింగ్ మెషిన్లో పడేశారు..

ఇరవై రోజుల పసికందును వాషింగ్ మేషిన్లో పడవేయడం కేసును కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కోజికోడ్ : ఇరవై రోజుల పసికందును వాషింగ్ మెషిన్లో పడవేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరనేది మాత్రం మిస్టరీగా మారింది.  అయితే ఆ పాపను కన్నతల్లే వాషింగ్ మెషిన్ లో పడేసిందన్న  అనుమానాలు వ్యక్తం అవుతున్నా, పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఇప్పుడే ఈ కేసు వివరాలు వెల్లడిస్తే నిందితులకు తప్పించుకునే అవకాశం ఉంటుందని, అందువల్ల విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కోడువ్యాలీ సీఐ ప్రేమ్జీత్ పేర్కొన్నారు. అందుకే తాము ఎవరి పేరును బయటపెట్టాలని భావించడం లేదని చెప్పారు. కేరళలోని కోడువ్యాలీలోని గురువారం ఓ ఇంట్లో ... పసిపాపను వాషింగ్ మెషిన్ లో గుర్తించిన విషయం స్థానికంగా కలకలం సృష్టించిన విషయం విదితమే.

గుర్తు తెలియని వ్యక్తి.. పాప తల్లి కళ్లలో కారం చల్లడంతో ఆమె గట్టిగా కేకలు వేసిందని, శబ్దం విని అక్కడికి వెళ్లిన చుట్టుపక్కల వాళ్లు వాషింగ్ మెషిన్లో పసికందును గుర్తించినట్లు చెబుతున్నారని సీఐ  పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, నిజనిజాలు తేలేంత వరకూ ఎవరిని అరెస్టు చేసేది లేదన్నారు. ఈ ఘటనలో పాప తల్లిదే తప్పు అని మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ తాము అలా తొందరపడి ఓ అభిప్రాయానికి రాలేమని సీఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement