మహిళాధికారిని వేధిస్తున్న ఇన్స్పెక్టర్ అరెస్ట్ | police inspector arrested in sexual harassment case | Sakshi
Sakshi News home page

మహిళాధికారిని వేధిస్తున్న ఇన్స్పెక్టర్ అరెస్ట్

Jul 2 2014 7:54 PM | Updated on Aug 21 2018 7:39 PM

ఒడిశాలో మహిళా పోలీస్ అధికారిని లైంగికంగా వేధిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ను క్రైం బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు.

భువనేశ్వర్: ఒడిశాలో మహిళా పోలీస్ అధికారిని లైంగికంగా వేధిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ను  క్రైం బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. అజిత్ కుమార్ స్వైన్ అనే అతను 13 సంవత్సరాలుగా మహిళా అధికారిని వేధిస్తున్నట్టు కేసు దాఖలైంది.

తనను మానసికంగా, భౌతికంగా వేధించినట్టు బాధితురాలు కేసు పెట్టింది. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి రెండు నెలలుగా విధులకు రాకుండా అజ్ఞాతంలో ఉన్న అజిత్ను బుధవారం భువనేశ్వర్లో  అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినట్టు క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement