
ముందు ఆమోదం.. తర్వాత సవరణలు
‘భూ సేకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేందుకు మొదట సహకరించండి.
తీన్‌బీఘా(పశ్చిమబెంగాల్): ‘భూ సేకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేందుకు మొదట సహకరించండి. భవిష్యత్తులో అది రైతు వ్యతిరేకమని తేలితే.. ఎప్పుడైనా సరే అవసరమైన సవరణలు చేసుకోవచ్చు’ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్షాలను అభ్యర్థించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే సవరణలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని మంగళవారమిక్కడ అన్నారు.