వికలాంగురాలిపై మేనమామ అత్యాచారం | Physically challenged girl raped | Sakshi
Sakshi News home page

వికలాంగురాలిపై మేనమామ అత్యాచారం

Jul 21 2015 7:05 PM | Updated on Jul 28 2018 8:51 PM

వికలాంగురాలైన మేనకోడలిని బెదిరించి ఆరు మాసాలుగా అత్యాచారం చేస్తున్న మేనమామ కిరాతకం ఆలస్యంగా మంగళవారం బయటపడింది.

హోసూరు (కర్ణాటక) : వికలాంగురాలైన మేనకోడలిని బెదిరించి ఆరు మాసాలుగా అత్యాచారం చేస్తున్న మేనమామ కిరాతకం ఆలస్యంగా మంగళవారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం హోసూరు పట్టణం డెంకణీకోట తాలూక అంచెట్టి సమీపంలోని ఏ.పుదూరు గ్రామానికి చెందిన ఓ రైతుకు వికలాంగురాలైన కూతురు(17) ఉంది. గేరెట్టి గ్రామానికి చెందిన అమావాసి(40) ఆ అమ్మాయికి మేనమామ.

కాగా ఆమెను బెదిరించి ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల కూతురి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షించగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో వారు విషయం తెలుసుకుని డెంకణీకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అమావాసి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement