రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ | Petition in the Madras High Court is seen | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్

Mar 7 2015 1:56 AM | Updated on Oct 8 2018 3:56 PM

రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ - Sakshi

రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్

రాష్ట్ర ఖజానాకు రూ.21 కోట్లు నష్టం కలిగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, 'లింగా' చిత్ర నిర్మాత రాక్‌లింగ్ వెంకటేశ్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

చెన్నై: రాష్ట్ర ఖజానాకు రూ.21 కోట్లు నష్టం కలిగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, 'లింగా' చిత్ర నిర్మాత రాక్‌లింగ్ వెంకటేశ్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరైన్ పిక్చర్స్ భాగస్వామి సింగరవడివేలన్ ఈ పిటిషన్ వేశారు. రజనీ తన పలుకుబడి ఉపయోగించి 'లింగా'కు వినోదపు పన్ను మినహాయింపు ఇప్పించారని, తమిళ సంస్కృతి అభివృద్ధికి దోహదపడే చిత్రాలకు మాత్రమే వినోదపు పన్ను రాయితీ వర్తిస్తుందన్నారు. 'లింగా' చిత్రం టైటిల్ సంస్కృతంలో ఉన్నందున దీనికి రాయితీ వర్తించదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement