పన్నీర్‌కు శాశ్వత ఉద్వాసన | Paneer to a permanent farewell from AIDMK | Sakshi
Sakshi News home page

పన్నీర్‌కు శాశ్వత ఉద్వాసన

Feb 15 2017 3:31 AM | Updated on Sep 2 2018 5:28 PM

పన్నీర్‌కు శాశ్వత ఉద్వాసన - Sakshi

పన్నీర్‌కు శాశ్వత ఉద్వాసన

ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలపై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తిరుగుబాటుదారులుగా ముద్రవేశారు.

తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నిర్ణయం

సాక్షి, చెన్నై: ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలపై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తిరుగుబాటుదారులుగా ముద్రవేశారు. పన్నీర్‌సెల్వం, మంత్రి పాండియరాజన్‌తో పాటు 20 మందిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి మంగళవారం శాశ్వతంగా తొలగించారు. కోర్టు తీర్పు వెలువడ్డ కాసేపటికి ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు మినహా, పార్టీ పదవుల్లో ఉన్న ఇతర నాయకుల్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ శశికళ ప్రకటించారు.

ఇందులో ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం, విద్యాశాఖ మంత్రి పాండియరాజన్‌ కూడా ఉన్నారు. అలాగే, పార్టీ అధికార ప్రతినిధి పొన్నయ్యన్, మాజీ మంత్రులు నత్తం విశ్వనాథన్, కేపీ.మునుస్వామి, పి. మోహన్‌లతో పాటు మొత్తం 20 మందిని అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్టు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement