పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు
Apr 5 2017 10:54 AM | Updated on Mar 23 2019 8:33 PM
శ్రీనగర్: పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మూలోని పూంఛ్ సెక్టార్‌లో బుధవారం ఉదయం పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు వారికి ధీటైన జవాబిస్తున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత నాలుగు రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీ మూడు సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది.
Advertisement


