మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ | Pakistan violates ceasefire again | Sakshi
Sakshi News home page

మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్

Aug 18 2014 8:30 AM | Updated on Sep 2 2017 12:04 PM

పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్‌ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్‌ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా  తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement