మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని రాక | Pakistan PM Nawaz Sharif to attend Narendra modi's swearing in ceremony | Sakshi
Sakshi News home page

మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని రాక

May 24 2014 11:41 AM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని  రాక - Sakshi

మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని రాక

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు.

ఇస్లామాబాద్ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వ వర్గాలు శనివారం ధ్రువీకరించాయి. ఈనెల 26న మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నవాజ్ షరీఫ్తోపాటు పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ కూడా హాజరవనున్నట్లు సమాచారం. వీరు సోమవారం భారత్కు రానున్నట్లు పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement