ఫైన్‌ భయం, వ్యాన్‌లో కూడా హెల్మెట్‌ | Once fined, he now wears helmet in a van | Sakshi
Sakshi News home page

ఫైన్‌ భయం, వ్యాన్‌లో కూడా హెల్మెట్‌

Dec 5 2017 1:58 PM | Updated on Oct 2 2018 4:31 PM

Once fined, he now wears helmet in a van - Sakshi

జైపూర్‌ : సీటు బెల్ట్స్‌ పెట్టుకోకుండా.. హెల్మెట్‌ పెట్టుకోకుండా వ్యాన్‌ డ్రైవ్‌ చేస్తున్నారా? అయితే మీరు పోలీసుల చిక్కుల్లో పడినట్టే. ఇదేమీ ఫేక్‌ కాదు. నిజమే. ఓ 23 ఏళ్ల వ్యక్తి ఫోర్‌-వీలర్‌ నడుపుతూ.. హెల్మెట్‌ పెట్టుకోనందుకు పోలీసులు రూ.200 జరిమానా విధించారు. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి హెల్మెట్‌ లేనిదే తన వ్యాన్‌ ఎక్కడమే మానేశాడు. భరత్‌పుర్‌లోని సెవార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కరేరా గ్రామానికి చెందిన విష్ణు శర్మ, ఆగ్రా నుంచి డిసెంబర్‌ 1న తన గ్రామానికి తన వ్యాన్‌ డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని రోడ్డుపై అడ్డగించిన పోలీసులు, రూ.200 జరిమానా విధించారు. ఈ జరిమానాకు వారు అందించిన రశీదు చూసి విష్ణు శర్మ ఆశ్చర్యపోయాడు. హెల్మెట్‌ ధరించనందుకు జరిమానా విధిస్తున్నట్టు రశీదులో పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి అతను తన వ్యాన్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించడం ప్రారంభించాడు.

శర్మ చెప్పిన వివరాల ప్రకారం...తన వద్ద అన్నీ ఉన్నాయని, డ్రైవింగ్‌ లైసెన్సు, కాలుష్యం, వాహన రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ పేపర్లు ఇలా ప్రతీది తన వద్ద ఉన్నట్టు చెప్పాడు. సీటు బెల్ట్‌ కూడా పెట్టుకున్నట్టు పేర్కొన్నాడు. కానీ పోలీసులు జరిమానా విధించినట్టు తెలిపాడు. హెల్మెట్‌ పెట్టుకోలేదనే కారణంతో, జరిమానా విధించినట్టు తెలిపాడు. ఇక అప్పటి నుంచి హెల్మెట్‌ ధరిస్తున్నానని, ఎవరికి తెలుసు? మళ్లీ పోలీసులు విధిస్తారో లేదో అని అన్నాడు. ఇదే విషయంపై హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రహ్లాద్‌ సింగ్‌ను ఆ‍శ్రయిస్తే, శర్మ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోనందుకు జరిమానా విధించామని, చలాన్‌ బుక్‌లో పొరపాటుగా హెల్మెట్‌ అని నమోదుచేశామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement