డార్జిలింగ్‌ను విభజించే ప్రసక్తే లేదు | No division of Darjeeling Hills: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

డార్జిలింగ్‌ను విభజించే ప్రసక్తే లేదు

Apr 14 2014 1:31 AM | Updated on Aug 14 2018 4:21 PM

డార్జిలింగ్‌ను విభజించే ప్రసక్తే లేదు - Sakshi

డార్జిలింగ్‌ను విభజించే ప్రసక్తే లేదు

డార్జిలింగ్ కొండప్రాంత విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

డార్జిలింగ్(పశ్చిమబెంగాల్): డార్జిలింగ్ కొండప్రాంత విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆమె ఆదివారమిక్కడ ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు.
 
తమ ప్రభుత్వం డార్జిలింగ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రత్యేక ప్యాకేజీలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాల, విద్యుత్, తాగునీటికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. బంద్ పిలుపులపై తృణమూల్ అధినేత్రి మండిపడ్డారు.
 
సమ్మెలకు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపుల మూసివేతలకు కొందరు పిలుపులిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement