రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల


సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించారు. నిజానికి బుధవారమే ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో కార్యక్రమం వాయిదా పడింది. ఇక గురువారం ఉదయం సౌత్‌ బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మరో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు.

 

ఇటీవల కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు రక్షణ శాఖ పగ్గాలను మోదీ అప్పగించిన విషయం తెలిసిందే. స్వతంత్ర్య భారతావనికి ఆమె రెండో మహిళా రక్షణ శాఖా మంత్రి. కాగా, ఇందిరాగాంధీ(ప్రధానిగా ఉన్న సమయంలో తాత్కాలిక బాధ్యతలు) తర్వాత పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు.

 

నిర్మలా సీతారామన్‌ బయోడేటా...


 


తమిళనాడులోని ముధురై లో  1959 ఆగష్టు 18న ఆమె జర్మించారు. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. న్యూఢిల్లీ లోని జవహార్ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఇండో-యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ ట్రేడ్‌ పై దృష్టిసారించిన ఆమె ఆ అంశంలోనే పీహెచ్‌డీ చేశారు. 


 


లండన్‌ లోని అగ్రికల్చరల్‌ ఇంజనీర్స్ అసోషియేషన్ లో ఆర్థిక విభాగంలో సహయకురాలికి ఆమె విధులు నిర్వహించారు. ఆపై ప్రైస్ వాటర్‌హౌజ్‌ కు సీనియర్ మేనేజర్‌ గా పని చేశారు. అదే సమయంలో ఆమె బీబీసీ అంతర్జాతీయ సేవా విభాగంలో పని చేశారు కూడా. తిరిగి ఇండియాకొచ్చాక  హైదరబాద్‌ లోని సెంటర్ ఫర్‌ పబ్లిక్ పాలసీ సర్వీస్ విభాగానికి డిప్యూటీ డైరక్టర్ గా సేవలు అందించారు. అటుపై నేషనల్‌ కమిషన్ ఫర్‌ ఉమెన్ సభ్యురాలిగా(2003-05) ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మహిళా సాధికారకత పలు ప్రసంగాలు ఆమె వినిపించారు. 


 


2008లో బీజేపీలో చేరిన ఆమె జాతీయ కార్యవర్గ సంఘంలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2010 మార్చి లో అధికార ప్రతినిధిగా పార్టీ నియమించటంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె చివరకు 2014 మే 26న కొలువుదీరిన కేబినెట్ లో కేంద్ర వాణిజ్య శాఖ(స్వతంత్ర్య హోదా) మంత్రిగా ఆమె బాధ్యతుల స్వీకరించారు. చివరకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి విస్తరణలో నిర్మలా సీతారామన్‌ రక్షణ శాఖ కు ప్రమోట్ అయ్యారు. 


 


వ్యక్తిగత జీవితం... జేఎన్‌యూలో తన సహచర విద్యార్థి అయిన పరకాల ప్రభాకర్‌ ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీతారామన్‌ @nsitharaman పేరిట ట్విట్టర్‌ లో ఎప్పటికప్పుడు పోస్టులు అప్ డేట్ చేస్తుంటారు. 

 
 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top