
గంటసేపు సొరంగంలోనే
మాతా వైష్ణవీ దేవి ఆలయం- ఢిల్లీ మధ్య ఇటీవల ప్రవేశపెట్టిన శ్రీశక్తి సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు ప్రయాణికులను బెంబేలెత్తించింది. కత్రా రైల్వేస్టేషన్‌కు ఐదు
చండీగఢ్: మాతా వైష్ణవీ దేవి ఆలయం- ఢిల్లీ మధ్య ఇటీవల ప్రవేశపెట్టిన శ్రీశక్తి సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు ప్రయాణికులను బెంబేలెత్తించింది. కత్రా రైల్వేస్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోగల ఓ సొరంగంలో బుధవారం ఈ రైలు ఆగిపోయింది. ఈ రైలును ఇటీవల ప్రారంభించిన సంగతి విదితమే. ఈ విషయమై ఫిరోజ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్‌సీ గోయల్ మాట్లాడుతూ ఏడు గంటలకు కత్రా స్టేషన్‌కు చేరుకుందన్నారు. వాస్తవానికి ఇది ఈ స్టేషన్‌కు ఉదయం గం 5.30కే రావాల్సి ఉందన్నారు. ఈ సమాచారం అందగానే ఉధంపూర్‌నుంచి మరో ఇంజన్‌ను అక్కడికి పంపించామన్నారు.
ఇంజన్ ఎందుకు పనిచేయలేదనే అంశానికి సంబంధించి తమకు సమాచారం అందాల్సి ఉందన్నారు. 100 నిమిషాల తర్వాత శ్రీశక్తి సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు తన గమ్యస్థానానికి చేరుకుందన్నారు. అప్పటికే ఈ రైలు 35 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తోందని, దీంతో 100 నిమిషాల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుందన్నారు. ఇదే విషయమై ఉత్తర రైల్వే డివిజనల్ మేనేజర్ నీరజ్‌శర్మ మాట్లాడుతూ ఇంజన్ పనిచేయకపోవడం వల్లనే రైలు సొరంగంలో చిక్కుకుపోయిందన్నారు. టన్నెల్ మార్గంలో ఎటువంటి సమస్యలూ లేవన్నారు. మరో ఇంజన్ అక్కడికి చేరుకుని ఈ ఎక్స్‌ప్రెస్‌ను గమ్యస్థానానికి చేర్చిందన్నారు.